KCR: కేసీఆర్ పుట్టినరోజు... ఎర్రవెల్లిలో గ్రామస్తుల యాగం

Erravelli villagers yagam on KCR birthday date

  • యాగంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ శ్రేణులు
  • నందినగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు
  • కేసీఆర్ ఫ్లెక్సీలు తొలగించారంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బీఆర్ఎస్ ధర్నా

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఎర్రవెల్లిలో గ్రామస్తులు యాగం నిర్వహించారు. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి, యాగం నిర్వహించారు. ఈ యాగంలో కేసీఆర్ దంపతులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 

కవిత ప్రత్యేక పూజలు

బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వేదికలు ఏర్పాటు చేసి కేకులు కట్ చేస్తున్నారు, మిఠాయిలు పంచుతున్నారు. కొంతమంది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన తండ్రి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో గల వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తండ్రి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పూజలు చేశారు.

కేసీఆర్ ఫ్లెక్సీలు తొలగించారంటూ బీఆర్ఎస్ ధర్నా

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిరసన చేపట్టాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డుతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన పుట్టినరోజు శుభాకాంక్షలకు సంబంధించిన ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

  • Loading...

More Telugu News