Nara Lokesh: జగన్ ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనం: నారా లోకేశ్

Nara Lokesh fires on Jagan

  • జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతాఇంతా కాదన్న లోకేశ్
  • అందినకాడికి అప్పులు చేశారని మండిపాటు
  • జగన్ చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీ రూ. 24,944 కోట్లకు చేరిందని విమర్శ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి నారా లోకేశ్ మరోసారి ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతాఇంతా కాదని అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. అందినకాడికి అప్పులు చేశారని విమర్శించారు. 

58 ఏళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ. 14,155 కోట్ల వడ్డీ చెల్లిస్తుండగా... జగన్ పాలించిన ఐదేళ్ల కాలానికి అంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ రూ. 24,944 కోట్లకు చేరిందని చెప్పారు. అందరు ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే ఐదేళ్లలో జగన్ చేసిన అప్పుపై కట్టే వడ్డీనే దాదాపు రూ. 11 వేల కోట్లు అధికమని తెలిపారు. జగన్ ఎంతటి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. 



  • Loading...

More Telugu News