KTR: కేసీఆర్.. తెలంగాణ కారణజన్ముడు: కేటీఆర్

- తెలంగాణ భవన్ లో ఘనంగా కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు
- కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న కేటీఆర్
- ఆయనను మళ్లీ సీఎం చేసేందుకు గట్టిగా పనిచేద్దామని పిలుపు
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 71 కిలోల భారీ కేక్ ను మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు కట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ జాతికి మాజీ సీఎం కేసీఆర్ హీరో. తెలంగాణ కారణజన్ముడు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసేందుకు మనం కూడా అంతే గట్టిగా పనిచేద్దాం. రానున్న మూడున్నరేళ్లు 60 లక్షల గులాబీ దండు. ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలి. అని కేటీఆర్ అన్నారు.