Revanth Reddy: కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

Revanth Reddy birthday greetings to KCR

  • నేడు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న కేసీఆర్
  • కేసీఆర్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నానన్న రేవంత్
  • రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

'గజ్వేల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం తెలిపారు.

  • Loading...

More Telugu News