Nara Lokesh: మహాకుంభమేళాకు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇలా..!

- ప్రయాగ్‌రాజ్ లోని మహాకుంభమేళాకు ఈరోజు బయలుదేరి వెళ్లిన మంత్రి లోకేశ్
- ఉదయం 10.10 నుంచి మధ్యాహ్నం 12.10 గంటల మధ్య షాహి స్నానఘట్టంలో పుణ్య స్నానం
- మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రయాగ్‌రాజ్ నుంచి వారణాసికి పయనం
- మధ్యాహ్నం 2.45 గంటలకు వారణాసి కాలభైరవ ఆలయం సందర్శన
- సాయంత్రం 3.40 గంటలకు కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
- ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు విశాలాక్షి దేవాలయం దర్శనం
- సాయంత్రం 5.25 గంటలకు వారణాసి నుంచి విజయవాడకు తిరుగు పయనం
ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేశ్... యూపీలోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఉదయం 10.10 నుంచి మధ్యాహ్నం 12.10 గంటల మధ్య షాహి స్నానఘట్టంలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రయాగ్‌రాజ్ నుంచి వారణాసికి పయనం కానున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు వారణాసి కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు.
అలాగే సాయంత్రం 3.40 గంటలకు వారణాసికి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు విశాలాక్షి దేవాలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఈ ఆలయం సందర్శన అనంతరం సాయంత్రం 5.25 గంటలకు వారణాసి నుంచి విజయవాడకు తిరుగు పయనమవుతారు.
కాగా, ప్రయాగ్‌రాజ్ లో గత నెల 13 నుంచి ప్రారంభమైన మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాదిగా భక్తులు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ నెల 26 వరకు కుంభమేళా జరగనుంది. 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు మొదట 40 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ, ఇప్పటికే ఆ సంఖ్య దాటిపోయింది. ఇంకా తొమ్మిది రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది.