Mastan Sai: మస్తాన్ సాయి వివాదంలో కీలక పరిణామం.. ఏపీ గవర్నర్ కు లావణ్య లేఖ

- ఏపీ గవర్నర్ కు లావణ్య తరపు లాయర్ లేఖ
- మస్తాన్ సాయి వల్ల మస్తాన్ దర్గాకు అపవిత్రత కలుగుతోందన్న లాయర్
- దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబ సభ్యులను తొలగించాలని విన్నపం
మస్తాన్ సాయి, లావణ్యల మధ్య వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లావణ్య తరపు న్యాయవాది నాగూర్ బాబు లేఖ రాశారు. మస్తాన్ సాయి వల్ల మస్తాన్ దర్గాకు అపవిత్రత కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. గుంటూరులోని మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబ సభ్యులను తొలగించాలని లేఖలో కోరారు. ఈ లేఖను చీఫ్ సెక్రటరీ, గుంటూరు జిల్లా కలెక్టర్, మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు.
సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్యల మధ్య నెలకొన్న వివాదం సినీ పరిశ్రమలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మస్తాన్ సాయి నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే మస్తాన్ సాయిపై మహిళల న్యూడ్ ఫొటోలు తీయడం, అత్యాచారం, డ్రగ్స్ ఇలా పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మస్తాన్ సాయి హైదరాబాద్ నార్సింగి పోలీసుల కస్టడీలో ఉన్నాడు.