Virat Kohli: కోహ్లీని కాదని రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్న ఆర్సీబీ.. ఎందుకో చెప్పిన సంజయ్ మంజ్రేకర్

- జట్టులో కోహ్లీ ఉండగా యువ ఆటగాడు రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా ప్రకటించిన ఆర్సీబీ
- కోహ్లీపై ఒత్తిడి పెంచడం ఇష్టం లేకే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందన్న మంజ్రేకర్
- మార్చి 22న కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో తలపడనున్న కేకేఆర్-ఆర్సీబీ
దిగ్గజాలు నేతృత్వం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ఈసారి యువ ఆటగాడు రజత్ పటీదార్ నడిపించబోతున్నాడు. కోహ్లీ వంటి దిగ్గజ క్రికెటర్ జట్టులో ఉండగా అనూహ్యంగా రజత్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంపై క్రికెట్ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. కోహ్లీపై ఒత్తిడి పెంచడం ఇష్టం లేకనే ఆర్సీబీ అతడికి పగ్గాలు అప్పగించలేదని పేర్కొన్నాడు.
ప్రాంచైజీకి ఫా డుప్లెసిస్ గుడ్ బై చెప్పేసిన తర్వాత 36 ఏళ్ల కోహ్లీని మళ్లీ కెప్టెన్ చేస్తారని భావించారు. కానీ, ఫ్రాంచైజీ మాత్రం పటీదార్ వైపు మొగ్గుచూపింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో మధ్యప్రదేశ్ జట్టును నడిపించిన పటీదార్ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 81 పరుగులు చేశాడు. అయినప్పటికీ జట్టు ఓడిపోయింది.
తాజాగా ‘స్టార్ స్పోర్ట్స్’తో మంజ్రేకర్ మాట్లాడుతూ.. ఆర్సీబీ మంచి నిర్ణయం తీసుకుందని ప్రశంసించాడు. జట్టు బాధ్యతలు అప్పగించడం ద్వారా కోహ్లీపై ఒత్తిడి పెంచాలని ఆర్సీబీ అనుకోలేదని పేర్కొన్నాడు. రానున్న సీజన్‌లో కోహ్లీతోపాటు రోహిత్ శర్మ కూడా మెరుస్తారని మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా-ఆర్బీబీ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్ జరగనుంది.