Lemon: నిమ్మకాయ రూ. 5 లక్షలు.. వేలంలో సొంతం!

Palani Murugan Temple Lemon Auctioned For Rs 5 Lakh

  • తమిళనాడులోని పళనిలో ఘటన
  • పళనిలో ఏటా మూడు రోజులపాటు తైపూస ఉత్సవాలు
  • స్వామి వారి పాదాల చెంత ఉంచిన నిమ్మకాయలకు వేలం
  • రూ. 5 లక్షలకు దక్కించుకున్న భక్తుడు

తమిళనాడులోని పళనిలో ఓ నిమ్మకాయకు వేలంలో దాదాపు రూ. 5 లక్షల ధర పలికింది. పుదుక్కోటై జిల్లా తిరువరుంగుళం వల్లనాట్టు చెట్టియార్‌ వర్గీయులు పళనిలో ఏటా మూడు రోజుల పాటు తైపూస ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం చేస్తారు. ఈ క్రమంలో స్వామి పాదాల వద్ద ఒక్కో నిమ్మకాయ పెట్టి పూజ చేస్తుంటారు. 

తాజాగా వాటిని వేలం వేయగా ఒక్కో నిమ్మకాయ రూ. 16 వేల నుంచి రూ. 40 వేల వరకు ధర పలికింది. తైపూసం రోజున మురుగన్‌ అభిషేకం సమయంలో స్వామి పాదల వద్ద ఉంచిన నిమ్మకాయను మాత్రం ఓ భక్తుడు రూ. 5.09 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ వేలంలో వల్లనాట్లు చెట్టియార్లు మాత్రమే పాల్గొంటారు. స్వామి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయ తమ వద్ద ఉంటే శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకనే పూజలో పెట్టే నిమ్మకాయలను భక్తులు పోటీ పడి మరీ వేలంలో దక్కించుకుంటారు. 

  • Loading...

More Telugu News