Pravind Jugnauth: మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్ట్

Mauritius Former PM Pravind Jugnauth Arrested

  • 2017 నుంచి 2024 వరకు ప్రధానిగా పనిచేసిన ప్రవింద్ జగన్నాథ్
  • ఆయన హయాంలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు గుర్తింపు
  • సోదాల్లో కీలక పత్రాలు, ఖరీదైన వాచీలు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం

మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 నుంచి 2024 వరకు ప్రధానిగా పనిచేసిన జగన్నాథ్ గతేడాది చివర్లో రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని ఒప్పందాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని, వాటిపై ఆడిట్ నిర్వహిస్తామని ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నవీన్ రామ్‌గూలం ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో తాజాగా జగన్నాథ్ నివాసంలో ఆర్థిక నేరాల కమిషన్ శనివారం సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా కీలక డాక్యుమెంట్లు, ఖరీదైన గడియారాలు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. ప్రవింద్ భార్య కోబితాను కూడా అధికారులు గంటపాటు విచారించారు. అనంతరం ప్రవింద్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను సెంట్రల్ మారిషస్‌లోని మోకాలో ఉన్న నిర్బంధ కేంద్రంలో ఉంచారు.

  • Loading...

More Telugu News