illegal indian immigrants: మరో 112 మంది వలసదారులను భారత్‌కు పంపిన అమెరికా

- 112 మందితో వచ్చిన అమెరికా మిలటరీ విమానం
- ఆదివారం రాత్రి అమృతసర్ చేరిక
- ఇప్పటి వరకూ 332 మందిని పంపిన అమెరికా
112 మంది భారతీయ అక్రమ వలసదారులతో కూడిన అమెరికా మిలటరీ విమానం ఆదివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దిగింది. భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించడం ఇది మూడవసారి. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిని వెనక్కి పంపేందుకు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా ఇదివరకే రెండు విమానాలలో భారత్‌కు చెందిన వలసదారులను పంపిన విషయం విదితమే.
తాజాగా పంపిన 112 మందితో కలుపుకొని ఇప్పటివరకు మూడు విడతలుగా 332 మంది అక్రమ వలసదారులను అమెరికా భారత్‌కు పంపింది. ఒకవైపు అక్రమ వలసదారులను అమెరికా మిలటరీ విమానంలో అమృత్‌సర్ విమానాశ్రయానికి పంపడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయులను అమెరికా గుర్తించిందని, వారు త్వరలోనే భారత్‌కు చేరుకుంటారని భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
ఇప్పటికే 332 మంది అక్రమ వలసదారులు భారత్‌కు రాగా, మరో 155 మంది అక్రమ వలసదారులను పంపనుంది.