KTR: నమస్తే తెలంగాణ ఎడిటర్ కుమారుడి వివాహానికి హాజరైన కేటీఆర్... వీడియో ఇదిగో!

- సిద్ధిపేటలో వివాహం
- వధూవరులను ఆశీర్వదించిన కేటీఆర్
- కేటీఆర్ తో సెల్ఫీలకు పోటీలు పడిన జనాలు
నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి కుమారుడు శ్రీకర్, మనస్విని వివాహం ఇవాళ సిద్ధిపేటలో జరిగింది. ఇక్కడి పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వివాహానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. నూతన దంపతులు శ్రీకర్, మనస్వినికి ఆశీస్సులు అందించారు. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ఈ పెళ్లికి వచ్చిన వారు కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. అయితే, కేటీఆర్ ఎంతో ఓపికతో అందరికీ సెల్ఫీలు ఇచ్చారు.