Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్ లపై ఐసీసీ కీలక నిర్ణయం

ICC issues additional tickets for Team India matches

  • ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
  • భారత్ ఆడే మ్యాచ్ లకు అదనంగా టికెట్ల జారీ
  • ఫైనల్ మ్యాచ్ కు ఇంకా టికెట్లు విడుదల చేయలేదన్న ఐసీసీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి మరో మూడ్రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇది వన్డే ఫార్మాట్ లో జరిగే టోర్నీ. కాగా, ఈ మెగా ఈవెంట్ లో భారత్ ఆడే మ్యాచ్ ల విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు ఈ టోర్నీలో ఆడే మ్యాచ్ లకు అదనపు టికెట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. 

హైబ్రిడ్ మోడ్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు గ్రూప్-ఏలో ఉంది. భారత్ ఈ నెల 20న బంగ్లాదేశ్ తో, ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో, మార్చి 2న న్యూజిలాండ్ జట్టుతో లీగ్ దశ మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లకు ఇప్పటికే టికెట్లనువిడుదల చేసిన ఐసీసీ... తాజాగా అదనపు టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. టీమిండియా ఫ్యాన్స్ కు ఇది నిజంగా శుభవార్తే.  

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్ లు దుబాయ్ లో ఆడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే... ఫైనల్ మ్యాచ్ పాకిస్థాన్లో కాకుండా దుబాయ్ లోనే జరుగుతంది. ఈ టైటిల్ మ్యాచ్ టికెట్లపైనా ఐసీసీ స్పందించింది. సెమీఫైనల్ మ్యాచ్ లకు పరిమితంగా టికెట్లు అందుబాటులో ఉన్నాయని, ఫైనల్ మ్యాచ్ కు ఇంకా టికెట్లు విడుదల చేయలేదని చెప్పింది. 

ఫైనల్ మ్యాచ్ జరిగేది లాహోర్ లోనా, దుబాయ్ లోనా అనేది టీమిండియాపైనే ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. సెమీస్ లో టీమిండియా ఓడిపోతే... ఫైనల్ మ్యాచ్ లాహోర్ లో జరుగుతుందని... సెమీస్ లో టీమిండియా గెలిస్తే... ఫైనల్ మ్యాచ్ కు దుబాయ్ వేదికగా నిలుస్తుందని వివరించింది. అందుకే, సెమీఫైనల్ మ్యాచ్ జరిగాకే ఫైనల్ మ్యాచ్ టికెట్లపై ఓ స్పష్టత వస్తుందని ఐసీసీ పేర్కొంది. 

Champions Trophy 2025
Additional Tickets
Team India
Pakistan
Dubai
  • Loading...

More Telugu News