Pawan Kalyan: ఎన్టీఆర్ ను వెండితెరకు పరిచయం చేసి కృష్ణవేణి ప్రత్యేక గుర్తింపు పొందారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan condolences to the demise of Krishnaveni

  • పాత తరం నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత
  • ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ పవన్ ప్రకటన
  • కృష్ణవేణి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని వెల్లడి

పాత తరం నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తెలుగు చలన చితర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా గుర్తింపు పొందిన కృష్ణవేణి గారు తుదిశ్వాస విడిచారని తెలిసి చింతించానని వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కృష్ణవేణి గారు బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ ను, ఘంటసాలను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయడం ద్వారా కృష్ణవేణి ప్రత్యేక గుర్తింపు పొందారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు. 

Pawan Kalyan
Krishnaveni
Demise
Telugu Cinema
  • Loading...

More Telugu News