Jagga Reddy: రాహుల్ ది బ్రాహ్మణ కుటుంబం... సందేహాలుంటే బండి సంజయ్ తెలుసుకోవాలి: జగ్గారెడ్డి

- ప్రధాని మోదీ కులంపై రేవంత్ వ్యాఖ్యలు
- రాహుల్ ను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు
- ఈ క్రమంలో స్పందించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
- తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుందని బీజేపీ నేతలకు తెలియదా అంటూ కౌంటర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం... దాంతో బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబం అని వెల్లడించారు. దీనిపై ఏవైనా సందేహాలుంటే బండి సంజయ్ తెలుసుకోవాలని హితవు పలికారు.
రాజకీయాల కోసం రాహుల్ గాంధీ కుటుంబం ఏనాడూ కులాన్ని వాడుకోలేదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ క్రిస్టియన్ అని బండి సంజయ్ మాట్లాడుతున్నారు... తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుందని బీజేపీ నేతలకు తెలియదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.