Nara Lokesh: వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

- నెల్లూరు జిల్లాలో వెంకటాచలం మండలంలో కార్యక్రమం
- వధూవరులను ఆశీర్వదించిన నారా లోకేశ్
- నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ కు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రజామందిరంలో ఏర్పాటు చేసిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై వధూవరులు యిమ్మణ్ణి విష్ణు, సాత్వికలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అంతకుముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మార్గమధ్యంలో తనని కలవడానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన నారా లోకేశ్... వారి నుండి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాగా, వివాహ రిసెప్షన్ వద్ద వెంకయ్యనాయుడుకు లోకేశ్ పాదాభివందనం చేశారు. లోకేశ్ ను వెంకయ్య సాదరంగా ఆహ్వానించారు.












