Nandamuri Balakrishna: ఈ వారంలోనే ఓటీటీలోకి డాకు మహరాజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Daku Maharaj OTT Release Date Confirmed By NetFlix

  • ఈ నెల 21 నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నెట్ ఫ్లిక్స్
  • థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాలయ్య బాబు కొత్త మూవీ
  • అఖండ 2 షూటింగ్ లో బిజీబిజీగా నందమూరి బాలకృష్ణ

బాలయ్య బాబు కొత్త సినిమా ‘డాకు మహరాజ్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు నెట్ ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ - బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. రికార్డు కలెక్షన్లతో తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో బాలయ్య బాబు వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్నారు. కాగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌లు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. మరోవైపు, బాలయ్య బాబు ప్రస్తుతం ‘అఖండ-2’ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. అఖండకు సీక్వెల్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

More Telugu News