ravichandran ashwin: టీమిండియాలో సూపర్ స్టార్ సంస్కృతిని తప్పుబట్టిన అశ్విన్

- క్రికెటర్లు నటులు, సూపర్ స్టార్ లు కాదన్న అశ్విన్
- భారత క్రికెట్‌లో అనేక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు
- సాధారణ ప్రజల మాదిరిగానే జీవన విధానం కొనసాగించాలని సూచన
టీమిండియాలో పెరుగుతున్న సూపర్ స్టార్ సంస్కృతిని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుబట్టారు. ఒక హిందీ యూట్యూబ్ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ క్రికెటర్లు నటులు, సూపర్ స్టార్లు కాదని కేవలం క్రీడాకారులు మాత్రమేనని అన్నారు. ఆటగాళ్లు నేల విడిచి సాము చేయకూడదని సూచించారు. జట్టులో ఎవరైనా ఆటగాడు సెంచరీ సాధిస్తే అది అతని గొప్పతనమేమీ కాదని అభిప్రాయపడ్డారు.
క్రీడాకారులు రోజువారీ జీవితంలో భాగమేనని గుర్తుంచుకోవాలని, మన లక్ష్యాలు వీటికన్నా ఎక్కువగా ఉండాలని ఆయన సూచించారు. భారత క్రికెట్‌లో అనేక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధానంగా జట్టులో ఎవరూ ఇలాంటి స్టార్ కల్చర్‌ను ప్రోత్సహించకూడదని ఆయన సూచించారు. సాధారణ ప్రజల మాదిరిగానే జీవన విధానం కొనసాగించాలని కోరారు.