Telangana: కులగణనలో పాల్గొనలేదా? ఫోన్ చేస్తే ఇంటికి ఎన్యుమరేటర్లు

People can call by phone for Caste sensus

  • కులగణనలో పాల్గొనని వారి కోసం రేపటి నుండి మరోసారి సర్వే
  • టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఇంటికే రానున్న ఎన్యుమరేటర్లు
  • ఎంపీడీవో కార్యాలయం, వార్డు కార్యాలయాలకు వెళ్లి కూడా నమోదు చేసుకునే వెసులుబాటు

తెలంగాణలో కుల గణనలో పాల్గొనని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఇదివరకు చేసిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి రేపటి నుండి ఈ నెల 28వ తేదీ వరకు చేసే రీసర్వేలో పాల్గొనాలని ఇప్పటికే తెలిపింది. ఈ క్రమంలో మరో వెసులుబాటు కల్పించింది. కుల గణన సర్వే కోసం ఫోన్ చేస్తే ఎన్యుమరేటర్లు వస్తారని తెలిపింది.

కుల గణన కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040-211-11111ను ఏర్పాటు చేసింది. కుల గణన సర్వే కోసం ఎవరైనా ఫోన్ చేస్తే ఎన్యుమరేటర్లు వారి ఇంటికి వెళ్లి వివరాలను నమోదు చేసుకుంటారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు కార్యాలయాలకు వెళ్లి కూడా వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.

Telangana
Caste Census
Congress
  • Loading...

More Telugu News