Jatadhara: పూజా కార్యక్రమాలతో సుధీర్ బాబు ‘జటాధర’ ప్రారంభం

Sudheer Babu starring Jatadhara shoot begins

  • సుధీర్ బాబు హీరోగా జటాధర
  • సూపర్ నేచురల్ మైథలాజికల్ జానర్లో చిత్రం
  • నేటి నుంచి షూటింగ్

నవ దళపతి సుధీర్ బాబు హీరోగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం జటాధర.  సూపర్ నేచురల్ మైథలాజికల్ జానర్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నేడు హైదరాబాదులో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్.బన్సాల్,  ప్రేరణ అరోరా నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

జటాధర ప్రారంభోత్సవానికి దర్శకుడు హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు మోహన ఇంద్రగంటి, సూపర్ స్టార్ మహేశ్ బాబు వదిన శిల్పా శిరోద్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తం షాట్ కు హరీశ్ శంకర్ క్లాప్ కొట్టారు.

జటాధర సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కారెక్టర్‌ చాలా భిన్నంగా ఉండబోతోంది. 

‘జటాధర’ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్ ముందుకు రానుంది. థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో ‘జటాధరా’ను ఉత్కంఠభరితంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ‘జటాధర’లో నిధి కోసం పోరాటం జరుగుతుంది.. కానీ పోరాడాలంటే కొన్ని శాపాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పోరాటం ఏంటి? ఈ శాపం ఏంటి? అని తెలియాలంటే ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News