Vangalapudi Anitha: పులివెందుల ఎమ్మెల్యే జగన్ చాలా బాధపడుతున్నారు: అనిత

Anitha comments on Vallabhaneni Vamsi arrest

  • అన్ని ఆధారాలతోనే వంశీని జైలుకు పంపించారన్న అనిత
  • వంశీ అరెస్ట్ పై జగన్ నీతి కబుర్లు చెపుతున్నారని విమర్శ
  • కక్ష తీర్చుకోవాలంటే ఇన్ని నెలల సమయం అవసరంలేదని వ్యాఖ్య

వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర హోం మంత్రి అనిత తప్పుబట్టారు. ముఖ్యమంత్రిని తిడితే బీపీ పెరిగి దాడి చేశారంటూ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్... ఇప్పుడు వంశీ అరెస్ట్ పై నీతి కబుర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 

దళితుడిని వంశీ భయపెట్టి కిడ్నాప్ చేయించారని అనిత చెప్పారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ ఆఫీసుపై దాడి జరిగితే కనీసం రక్షణ కల్పించలేదని విమర్శించారు. అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని తెలిపారు. ఈ విషయంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ చాలా బాధపడుతున్నారని అన్నారు. 

గత ఐదేళ్లు టీడీపీ నేతలపై లెక్కలేనన్ని తప్పుడు కేసులు పెట్టారని... తాము కక్ష తీర్చుకోవాలంటే ఇన్ని నెలల సమయం తీసుకోవాల్సిన అవసరం లేదని అనిత స్పష్టం చేశారు. నిందితులకు శిక్ష పడే విషయంలో కాలయాపన జరుగుతోందని చెప్పారు. ఎవిడెన్స్ సేకరించే విషయంలో అలర్ట్ గా ఉండాలని అన్నారు. పోలీసులు న్యాయవ్యవస్థకు గౌరవం ఇవ్వాలంటే... పోలీసులకు కూడా న్యాయవాదులు అంతే గౌరవం ఇవ్వాలని... అప్పుడే న్యాయం త్వరగా జరుగుతుందని చెప్పారు.  

  • Loading...

More Telugu News