Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ బయల్దేరిన భారత జట్టు.. ఇదిగో వీడియో!

- ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ
- ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్ పయనమైన భారత ఆటగాళ్లు
- ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో తన తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా దుబాయ్ బయలుదేరి వెళ్లింది. ముంబయి విమానాశ్రయం నుంచి భారత ఆటగాళ్లు పయనమై వెళ్లారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా సహా ఈ టోర్నీకి ఎంపికైన జట్టు సభ్యులు దుబాయ్ కి పయనమయ్యారు.
కాగా, ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈసారి టీమిండియ తన మ్యాచ్ లను దుబాయ్ వేదికగా ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత 23న దాయాది పాక్ తో తలపడుతుంది. మార్చి 1న కివీస్ తో రోహిత్ సేన తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.