Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ కాస్టింగ్ కాల్... నేను కూడా అప్లై చేశాను: మంచు విష్ణు

Manchu Vishnu applied for Spirit movie casting call

  • ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ చిత్రం
  • నటులు కావలెను అంటూ ప్రకటించిన ఇచ్చిన చిత్రబృందం
  • ఆసక్తికరంగా స్పందించిన మంచు విష్ణు

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం జరుపుకోనుంది. ఈ చిత్రంలో పలు పాత్రల కోసం కాస్టింగ్ కాల్ ప్రకటించారు. నటులు కావలెను అంటూ సోషల్ మీడియా వేదికగా స్పిరిట్ చిత్రబృందం ప్రకటన విడుదల చేసింది. అన్ని వయసుల పురుషులు, మహిళలు... సినిమా, నాటకరంగ నేపథ్యం ఉన్నవారు కావలెను అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

కాగా, స్పిరిట్ మూవీ కాస్టింగ్ కాల్ పై టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా స్పందించారు. యో... నేను కూడా ఈ సినిమాకు అప్లై చేశాను... ఏం జరుగుతుందో చూడాలి అని విష్ణు ట్వీట్ చేశారు. కాగా, స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News