Thandel: త‌గ్గేదేలే... రూ. 100 కోట్ల మార్క్‌ వైపు 'తండేల్' ప‌రుగులు!

Thandel Movie Races Towards Rs 100 Crore Mark

  • నాగ‌చైత‌న్య‌, చందు మొండేటి కాంబోలో 'తండేల్'
  • ఈ నెల 7న విడుద‌లైన‌ సినిమాకు హిట్ టాక్
  • భారీ వ‌సూళ్ల‌తో దూసుకెళుతోన్న చిత్రం
  • 8 రోజుల్లోనే ఏకంగా రూ.95.20 కోట్లు కొల్ల‌గొట్టిన వైనం

అక్కినేని నాగ‌చైత‌న్య‌, చందు మొండేటి కాంబినేష‌న్ లో వ‌చ్చిన 'తండేల్' సినిమా హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఈ నెల 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ భారీ వ‌సూళ్లు రాబడుతోంది. విడుద‌లైన ఎనిమిది రోజుల్లోనే ఏకంగా రూ.95.20 కోట్లు కొల్ల‌గొట్టింది. త్వ‌ర‌లోనే రూ.100 కోట్ల మార్కును అందుకోనుంది. 

టాలీవుడ్ బ‌డా నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. డీఎస్‌పీ సంగీతం సినిమాకు బాగా హెల్ప్ అయింది. పాట‌ల‌తో పాటు బీజీఎంను కూడా అద‌ర‌గొట్టారాయ‌న‌. దాంతో సినిమా మ‌రో స్థాయికి వెళ్లింద‌ని చెప్పాలి. 

బుజ్జితల్లి, రాజుగా సాయి పల్లవి, చైతూ త‌మ‌ పాత్ర‌ల్లో జీవించారు. దాంతో ఈ పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక పాకిస్థాన్ ఎపిసోడ్ సినిమాలో చాలా కీలకం. అయినా ఎమోషన్ అంతా రాజు, బుజ్జితల్లిల మధ్యే నడుస్తుంది. మూవీ ప్రారంభం నుంచి ఎండ్‌ కార్డ్ పడేవరకూ త‌మ‌ ప్రేమతో నింపేశారు. 

More Telugu News