Viral Videos: ఆ జీవులు మనుషుల్లా నడిస్తే? ఆశ్చర్యకరమైన వీడియో ఇదిగో!

- ఒకవేళ జంతువులు కూడా మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందనే వీడియో
- జిరాఫీ, ఏనుగుల నుంచి మొసళ్లదాకా నడిచే సీన్
- సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆశ్చర్యపరిచే వీడియో
మనుషులు కూడా ఒకప్పుడు వానర జాతి నుంచి అభివృద్ధి చెందినవారే అన్నది జీవ పరిణామ సిద్ధాంతం. క్రమంగా మానవులు అభివృద్ధి చెంది... రెండు కాళ్లతో నడవడం, ఆలోచించడం వంటివి నేర్చుకున్నారు. ఒకవేళ జంతువులు కూడా రెండు కాళ్లతో నడిస్తే ఎలా ఉంటుందనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి ఆలోచన వచ్చిన కొందరు వివిధ జంతువులు రెండు కాళ్లపై నడిస్తే ఎలా ఉంటుందనేది ఏఐ సాయంతో సృష్టించారు. ఆశ్చర్యపర్చే ఆ వీడియో కింద చూసేయండి. ఇందులో సింహం నడక మాత్రం హైలైట్ అని చెప్పవచ్చు.