Pawan Kalyan: షష్ట షణ్ముఖ ఆలయ యాత్ర పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan completes his spiritual tour in South India

  • దక్షిణ భారతదేశంలో పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన
  • 6 సుప్రసిద్ధ ఆలయాల సందర్శన
  • తిరుత్తణి ఆలయ సందర్శనతో పూర్తయిన పవన్ యాత్ర 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక పర్యటన ముగిసింది. తమిళనాడులోని తిరుత్తణి క్షేత్ర సందర్శనతో పవన్ కల్యాణ్ చేపట్టిన షష్ట షణ్ముఖ యాత్ర ముగిసింది. ఈ ఉదయం మధురై జిల్లాలో అళగర్  కొండల్లో కొలువైన అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. 

ఆలయ అధికారులు, అర్చకులు పవన్ ను పూలమాలలు, శాలువాతో సత్కరించి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా మురుగన్ కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్టి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆయన తనయుడు అకీరా నందన్, మిత్రుడు టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. 

అరుల్మిగు సోలైమలై ఆలయ సందర్శన అనంతరం పవన్ కల్యాణ్ తిరుత్తణి ఆలయానికి తరలి వెళ్లారు. ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో పవన్ వెంట తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసలు కూడా ఉన్నారు. షష్ట షణ్ముఖ యాత్రలో పవన్ కల్యాణ్ మొత్తం 6 సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. 

  • Loading...

More Telugu News