Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసులో దర్యాప్తు ముమ్మరం... హైదరాబాద్ లోని నివాసంలో సోదాలు

Searches in Vallabhaneni Vamsi Hyderabad home

  • విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రెండు పోలీసు బృందాలు
  • 'మై హోం భుజా'లోని వంశీ నివాసంలో సోదాలు
  • వంశీ మొబైల్ లో కీలక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసులు

కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో ఏపీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హైదరాబాద్ 'మై హోం భుజా'లోని వంశీ నివాసంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. విజయవాడ నుంచి రెండు పోలీసు బృందాలు హైదరాబాద్ కు వెళ్లాయి. 

వంశీ మొబైల్ ఫోన్ లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీ సెల్ ఫోన్ కోసం విజయవాడ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. వంశీని కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్ లో కూడా సెల్ అంశాన్ని పోలీసులు ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News