Errabelli Dayakar Rao: త్వరలో రేవంత్ రెడ్డి సీఎం పోస్టు పోవడం ఖాయం... ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు!

- తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం ముదురుతోందన్న మాజీ మంత్రి
- త్వరలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించబోతున్నారని వ్యాఖ్య
- మున్షీని రేవంత్ మేనేజ్ చేస్తున్నారనే... అధిష్ఠానం ఇన్‌ఛార్జ్‌ని మార్చిందన్న ఎర్రబెల్లి
- సీఎం పోస్టు నుంచి తనను పీకేస్తారనే భయంతోనే రేవంత్ ఢిల్లీ పయనమంటూ ఎద్దేవా
తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం ముదురుతోందని, త్వరలో రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నుంచి బహిష్కరించబోతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్నారు. మొన్నటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దీపాదాస్ మున్షీని ఆయన మేనేజ్ చేస్తున్నారనే... అధిష్ఠానం ఇన్‌ఛార్జ్‌ని మార్చిందని ఆరోపించారు.
త్వరలో తనను కూడా సీఎం పోస్టు నుంచి పీకేస్తారనే భయంతోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ పెద్దల మెప్పు కోసమే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై, ప్రధాని నరేంద్ర మోదీపై వరుసగా పదునైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.