US Army: ట్రంప్ మరో సంచలన నిర్ణయం

US Army to no longer allow transgender people to enlist in military

  • యూఎస్ ఆర్మీలో ట్రాన్స్ జెండర్లపై బ్యాన్
  • సైన్యంలోకి ఎంపిక చేయకుండా ఆదేశాలు
  • ఇప్పటికే ఉన్నవాళ్లను కొనసాగిస్తామని వెల్లడి

అమెరికాలో స్త్రీ, పురుషులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని, మరో జెండర్ ను గుర్తించబోమని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఆర్మీలోకి ట్రాన్స్ జెండర్లను ఎంపిక చేయబోమని స్పష్టం చేశారు. ఈమేరకు సైన్యంలో ట్రాన్స్ జెండర్ల ఎంట్రీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ట్రంప్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా యూఎస్ ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. సైన్యంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో లింగ మార్పిడికి అనుమతించబోమని స్పష్టం చేసింది.

లింగ మార్పిడి ఆపరేషన్లకు సంబంధించి ప్రస్తుతం ప్రాసెస్ లో ఉన్న దరఖాస్తులను అన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్లు పూర్తికాలం సేవలందించవచ్చని పేర్కొంది. కాగా, ప్రభుత్వ పథకాలు, ఇతర సందర్భాలలో పౌరుల నుంచి స్వీకరించే దరఖాస్తులలో జెండర్ కాలమ్ లో ఆడ, మగ మాత్రమే ఉంటుందని, థర్డ్ జెండర్ కు అవకాశం లేదని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. మహిళల క్రీడలలో ట్రాన్స్ జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించారు.

More Telugu News