Chinthamaneni Prabhakar: ఇలాగేనా ప్రవర్తించేది?.. చింతమనేనికి చంద్రబాబు అక్షింతలు

Chandrababu Fires On Chinthamaneni Prabhakar
    
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చింతమనేని దుర్భాషల వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం అధికారంలో ఉన్నామని, ఇలా సహనం కోల్పోయి వ్యవహరించడం తగదని హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లిన చింతమనేని కారుకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా ఉండటం వివాదానికి దారితీసింది. ఈ గొడవ గురించి చంద్రబాబుకు వివరించేందుకు చింతమనేని నిన్న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టేలా ప్రవర్తించారని ఆయన చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇలా స్పందించారు. 
Chinthamaneni Prabhakar
Chandrababu
Telugudesam

More Telugu News