Visakhapatnam: బ్లూఫిల్మ్స్ చూపిస్తూ వేధిస్తున్న భర్త.. భార్య ఆత్మహత్య

- విశాఖపట్నంలో ఘటన
- నీలి చిత్రాల్లో ఉన్నట్టుగా చేయాలని బలవంతం
- నిందితుడి నుంచి వయాగ్రా ట్యాబ్లెట్ల డబ్బా స్వాధీనం
బ్లూ ఫిల్మ్స్ చూపిస్తూ అందులో ఉన్నట్టుగా చేయాలని బలవంతం చేస్తున్న భర్త ఆగడాలను భరించలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. విశాఖపట్నంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు నాగేంద్రబాబుకు గతేడాది వివాహమైంది. బ్లూ ఫిల్మ్స్ చూడటాన్ని అలవాటుగా మార్చుకున్న నాగేంద్రబాబు వాటిని భార్య (23)కు చూపిస్తూ అలా చేయమని బలవంతం చేసేవాడు.
అంతేకాదు, వయాగ్రా మాత్రలు కూడా వేసుకునేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి కూడా నాగేంద్రబాబు ఇలాగే ప్రవర్తించడంతో ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వయాగ్రా ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.