Tirumala Laddu Row: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ తొలిరోజు విచారణ

- తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి
- సిట్ విచారణ షురూ
- నలుగురు నిందితులపై ప్రశ్నల వర్షం
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో సిట్ తొలి రోజు విచారణ ముగిసింది. నలుగురు నిందితులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏయే ప్రాంతాల్లో నెయ్యిని కల్తీ చేశారని ప్రశ్నించారు. నెయ్యి కల్తీ చేయాలని ఎవరైనా మీకు చెప్పారా? అని ప్రశ్నించారు. బోలేబాబా డెయిరీ నుంచి తిరుపతికి తీసుకువచ్చిన నెయ్యి ట్యాంకర్లలో ఎంత శాతం కల్తీ కలిసిందని సిట్ అధికారులు ప్రశ్నించారు.
భారీ స్థాయిలో కోరినంత నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకపోయినా... ఎందుకు టీటీడీ ప్రతిపాదనకు సరేనన్నారని ప్రశ్నించారు. ఏఆర్ డెయిరీ రాజశేఖర్ తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? కల్తీ నెయ్యి సరఫరా చేసి ఎంత కమీషన్ పొందారు? మీకు సపోర్ట్ చేసిన రాజకీయ నేత ఎవరు? అని సిట్ అధికారులు ప్రశ్నించారు.