Revanth Reddy: ఆ పాఠశాలలకు స్థలాలను త్వరగా కేటాయించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy orders to collectors on schools

  • యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం స్థలాలను గుర్తించాలన్న ముఖ్యమంత్రి
  • అనుమతులకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని ఆదేశం
  • అనువుగా లేనిచోట ప్రత్యామ్నాయం చూడాలన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి స్థలాలను వీలైనంత త్వరగా గుర్తించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

పాఠశాలల కోసం స్థలాల ఏర్పాటుపై ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. స్థలాలు కేటాయించిన వెంటనే అనుమతులకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలలకు కేటాయించిన స్థలాలు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని, అధికారులను ఆదేశించారు. అనువుగా లేనిచోట ప్రత్యామ్నాయ స్థలాలను చూడాలని అధికారులను ఆదేశించారు. 

వారం రోజుల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 105 స్థానాల్లో రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News