Acid Attack: యాసిడ్ దాడి బాధితురాలిని బెంగళూరుకు తరలిస్తున్న అధికారులు

--
అన్నమయ్య జిల్లాలో యాసిడ్ దాడికి, అత్యాచారానికి గురైన బాధితురాలిని ఏపీ అధికారులు బెంగళూరుకు తరలిస్తున్నారు. బాధితురాలిని మొదట మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు.. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బెంగళూరుకు తరలించాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బాధితురాలిని అధికారులు బెంగళూరుకు తరలిస్తున్నారు.
తన ప్రేమను అంగీకరించలేదని, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందనే కోపంతో గణేశ్ అనే యువకుడు ఓ యువతిపై దాడి చేశాడు. యువతి నోట్లో యాసిడ్ పోసి, కత్తితో తలపై విచక్షణరహితంగా పొడిచాడు. బాధతో కేకలు పెడుతున్న బాధితురాలిపై పైశాచికంగా అత్యాచారం చేశాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం సూచనలతో హోంమంత్రి అనిత బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. బాధితురాలిని బెంగళూరుకు తరలించాలని అధికారులకు సూచించారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని పోలీసులను ఆదేశించారు.