Nita Ambani: అనంత్ - రాధికల వివాహ వేడుకలపై విమర్శలు.. తాజాగా స్పందించిన నీతా అంబానీ

Nita Ambani responds to criticism over Anant Radhikas lavish wedding

  • బ్లూమ్ బర్గ్ ఇంటర్వ్యూలో విమర్శకులకు జవాబిచ్చిన నీతా
  • పిల్లల పెళ్లిని వైభవంగా జరపాలని ప్రతీ పేరెంట్స్ కు ఉంటుందని వివరణ
  • తాము కూడా తమ పిల్లలకు అదే చేశామని వెల్లడి

తమ కుమార్తె లేదా కుమారుడి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకుంటారని, తాము కూడా తమ పిల్లల విషయంలో అదే చేశామని నీతా అంబానీ చెప్పారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకలను అత్యంత ఆడంబరంగా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన అనంత్, రాధిక పెళ్లి వేడుకలను ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ రోజుల తరబడి నిర్వహించారు. రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ జరపడంతో పాటు పెళ్లికి హాలీవుడ్ నటులతో పాటు పలువురు సెలబ్రిటీలతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు రాగా అంబానీ దంపతులు స్పందించలేదు.

తాజాగా బ్లూమ్ బర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీతా అంబానీ ఈ విమర్శలపై స్పందించారు. అనంత్ పెళ్లిని ఆడంబరంగా నిర్వహించారనే విమర్శలు మీకు ఇబ్బందిగా అనిపించాయా? అన్న ప్రశ్నకు నీతా అంబానీ జవాబిచ్చారు. ‘పిల్లల పెళ్లి విషయంలో ప్రతి తల్లిదండ్రీ తమకు తోచిన విధంగా ఉత్తమంగా చేయాలనుకుంటారు. మేము కూడా అదే చేశాం. అనంత్ పెళ్లి మేడ్ ఇన్‌ ఇండియా బ్రాండ్ అని భావిస్తున్నా’ అని చెప్పారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగామని అన్నారు. ఈ విషయంలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని వివరించారు.

  • Loading...

More Telugu News