Vijay: హీరో విజయ్ భద్రత విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్ భద్రత విషయంలో కేంద్ర హోంశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు వై+ కేటగిరీ భద్రత కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం భద్రత స్థాయిని నిర్ణయిస్తుంది.