JioHotstar: జియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్ విలీనం... సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవే!

- ఒకే వేదికపైకి జియో సినిమా, డిస్నీప్లస్ హాట్‌స్టార్
- ఈ కొత్త యాప్ కు 'జియోహాట్ స్టార్'గా నామకరణం
- అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా మారిన జియోహాట్ స్టార్
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనమయ్యాయి. ఈ యాప్ కు 'జియోహాట్ స్టార్' అని పేరు పెట్టారు. ఇలా ఈ రెండు యాప్స్ ఒకే వేదికపైకి చేరడంతో జియోహాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా మారింది. ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట చూడవచ్చు.
కాగా, జియో హాట్‌స్టార్‌లో 100 లైవ్ టీవీ ఛానెల్స్, 30 గంటలకు పైగా కంటెంట్ ఉంటుంది. ఐపీఎల్ సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్ ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్ ల హక్కులను కలిగి ఉంది. అయితే, ఇకపై అన్ని మ్యాచ్ లను జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు.
జియోహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలా..
మొబైల్
రూ. 149/ 3 నెలలు
రూ. 499/ ఏడాది
* ఈ ప్లాన్ ద్వారా కేవలం ఒక మొబైల్ లో మాత్రమే కంటెంట్ చూసే వెసులుబాటు ఉంటుంది.
సూపర్
రూ. 299/ 3 నెలలు
రూ. 899/ ఏడాది
* ఈ ప్లాన్ ద్వారా రెండు డివైజ్‌లకు సపోర్ట్ ఉంటుంది.
ప్రీమియం
రూ. 499/ 3నెలలు
రూ. 1,499/ ఏడాది
* ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాలనుకునే వినియోగదారుల కోసం జియోహాట్ స్టార్ ఈ ప్రీమియర్ ప్లాన్లను తీసుకువచ్చింది.