Lavanya: మస్తాన్ సాయి నాపై అత్యాచారం చేశాడు.. రాజ్ తరుణ్ పై కేసులు వెనక్కి తీసుకుంటా: లావణ్య

- మస్తాన్ సాయితో పార్టీల్లో పాల్గొన్నానన్న లావణ్య
- మత్తుమందు ఇచ్చి న్యూడ్ వీడియోలు తీశాడని వెల్లడి
- మస్తాన్ సాయి తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని ఆందోళన
మస్తాన్ సాయి తనపై అత్యాచారం చేశాడని రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సంచలన విషయాన్ని వెల్లడించారు. తనను వంచించినట్టే ఎంతోమంది యువతులను మస్తాన్ చెరబట్టాడని తెలిపారు. తన న్యూడ్ వీడియోలు తీశాడని, వాటితో బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పారు. మస్తాన్ సాయితో కలిసి తాను పార్టీల్లో పాల్గొన్నానని... అప్పుడు మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేశాడని, ఆయన హార్డ్ డిస్క్ లో ఆ వీడియోలను చూశానని తెలిపారు. మస్తాన్ సాయి నిజ స్వరూపం బయటపెట్టాలన్న ఉద్దేశంతో ధైర్యం చేసినట్టు చెప్పారు. రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని తెలిపారు.
తనకు మస్తాన్ సాయి తల్లదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని లావణ్య ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు తనను చంపేస్తారని అన్నారు. గడప దాటాలన్నా భయపడుతున్నానని చెప్పారు. అన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నానని... మస్తాన్ సాయిపై న్యాయపోరాటం చేస్తానని అన్నారు. తన పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టించుకోనని చెప్పారు.