Allu Aravind: సాయి పల్లవితో అల్లు అరవింద్ డ్యాన్స్.. వీడియో వైరల్!

- నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తండేల్
- ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాకు హిట్ టాక్
- భారీ వసూళ్లతో దూసుకెళుతోన్న మూవీ
- తాజాగా శ్రీకాకుళంలో థ్యాంక్యూ మీట్ ను నిర్వహించిన మేకర్స్
- ఈ ఈవెంట్ లో హీరోయిన్ తో అల్లు అరవింద్ ఉత్సాహంగా స్టెప్పులు
నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ మూవీ మొదటి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 86 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం శ్రీకాకుళంలో థ్యాంక్యూ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ సాయిపల్లవితో కలిసి నిర్మాత అల్లు అరవింద్ ఉత్సాహంగా స్టెప్పులు వేయడం హైలైట్ గా నిలిచింది. అంతకుముందు హీరో నాగచైతన్య కూడా డ్యాన్స్ చేసి అలరించారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తమ సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.
కాగా, మత్స్యకారుల జీవన విధానాన్ని కళ్లకి కట్టిన సినిమా ‘తండేల్’. బుజ్జితల్లి (సాయి పల్లవి), రాజు (నాగ చైతన్య) పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. పాకిస్థాన్ ఎపిసోడ్ సినిమాలో కీలకం. అయినా ఎమోషన్ అంతా రాజు, సత్యల మధ్యే నడుస్తుంది. సినిమా ప్రారంభం నుంచి శుభం కార్డ్ పడేవరకూ కూడా బుజ్జితల్లీ, రాజుల ప్రేమతో నింపేశారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బాగా హెల్ప్ అయింది. పాటలతో పాటు బీజీఎంను కూడా అదరగొట్టారు డీఎస్‌పీ.