PM Modi: ఎలాన్ మ‌స్క్‌తో ఈ అంశాల‌పైనే చ‌ర్చించా.. ప్ర‌ధాని మోదీ ట్వీట్

PM Modi Meets Elon Musk in Washington DC

  • వాషింగ్ట‌న్ డీసీలో మ‌స్క్‌తో మోదీ భేటీ
  • స్పేస్‌, మొబిలిటీ, టెక్నాల‌జీ, ఇన్నోవేష‌న్ వంటి అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు వెల్ల‌డి
  • 'మినిమ‌మ్ గ‌వ‌ర్న‌మెంట్‌, మాగ్జిమ‌మ్ గ‌వ‌ర్నెన్స్'ను మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌డంపై చ‌ర్చ‌

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్రధాని న‌రేంద్ర మోదీ ప్ర‌పంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మ‌స్క్‌తో వాషింగ్ట‌న్ డీసీలో భేటీ అయిన‌ట్లు ట్వీట్ చేశారు. స్పేస్‌, మొబిలిటీ, టెక్నాల‌జీ, ఇన్నోవేష‌న్ వంటి అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు మోదీ తెలిపారు. 

సంస్క‌ర‌ణ‌ల వైపు భార‌త్ చేస్తున్న ప్ర‌య‌త్నాల గురించి, 'మినిమ‌మ్ గ‌వ‌ర్న‌మెంట్‌, మాగ్జిమ‌మ్ గ‌వ‌ర్నెన్స్'ను మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌డంపై ఆయ‌న‌తో మాట్లాడిన‌ట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. బ్లెయిర్ హౌస్‌లో ఈ ఇద్ద‌రు నేత‌లు సమావేశమయ్యారు. మస్క్ ముగ్గురు పిల్లలను కూడా మోదీ క‌లిశారు. అలాగే యూఎస్ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు మైఖేల్ వాల్ట్‌జ్‌, వివేక్ రామ‌స్వామితోనూ ప్ర‌ధాని స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపారు.  

More Telugu News