Alla Nani: తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని

- ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆళ్ల నాని
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
- కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇతర నాయకులు
మాజీ మంత్రి ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.
చంద్రబాబునాయుడు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సుజయ్ కృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు.




