Andhra Pradesh: ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ సహకారం: నారా లోకేశ్

AP Minister Lokesh meets Richard Chen

  • తైవాన్ అధికారుల బృందంతో మంత్రి నారా లోకేశ్ భేటీ
  • తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్‌తో మంత్రి చర్చలు
  • ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ సహకారం కోరిన మంత్రి
  • ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధితో లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ సహకారం కోరారు విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్‌తో నారా లోకేశ్ చర్చలు జరిపారు.

ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ తయారీ రంగాల్లో తైవాన్ అగ్రగామిగా ఉంది. సమావేశంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి  తైవాన్ తీసుకొచ్చిన పాలసీలు, తీసుకున్న చర్యల గురించి నారా లోకేశ్ తైవాన్ ప్రతినిధుల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తీసుకొచ్చిన పాలసీలు, అనుమతుల దగ్గర నుండి ఉత్పత్తి ప్రారంభం వరకూ ప్రభుత్వం నుండి అందిస్తున్న సహకారం గురించి మంత్రి వివరించారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్దతిలో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి పలు ఉదాహరణలతో వివరించారు. 2014-19 వరకూ తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి కల్పించిన మౌలిక సదుపాయాలు, అక్కడ ఏర్పాటైన అనేక కంపెనీలు తద్వారా వేలాదిగా యువతకు లభించిన ఉద్యోగ అవకాశాల గురించి తైవాన్ బృందం దృష్టికి తీసుకెళ్లారు.

ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే వీటిని ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి పని చేస్తున్నామని నారా లోకేశ్ అన్నారు. తైవాన్‌లో ఉన్న అనేక కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికలతో ఉన్నాయని, ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు సహకారం అందించాలని లోకేశ్ కోరారు.

ఆయా కంపెనీలు సులభంగా కార్యకలాపాలు ప్రారంభించే విధంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ ప్రత్యేక పార్కులు ఏర్పాటుకు సహకరించాలని మంత్రి కోరారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్  రంగాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తైవాన్ బృందం తెలిపింది. ఈ సమావేశంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్, నెక్సస్ ఇండో కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ ఎరిక్ చాంగ్, ఏపీ ప్రభుత్వం తరపున ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News