Aishvaeya Rajesh: కష్టపడి అమ్మ కన్నీళ్లు తుడిచా: ఐశ్వర్య రాజేశ్!

- తన చిన్నప్పుడే ఫాదర్ పోయారన్న ఐశ్వర్య రాజేశ్
- తల్లికి ఎవరి సపోర్ట్ ఉండేది కాదని వెల్లడి
- ఆమె ఎన్నో కష్టాలు పడిందని వివరణ
- తన కల నిజమైందంటూ హర్షం
'మల్లె మొగ్గలు' హీరో రాజేశ్ కూతురే ఐశ్వర్య రాజేశ్. తమిళంలో ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. ఇటీవల విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఆమెకి మంచి హిట్ ఇచ్చింది. తాజాగా 'జర్నలిస్ట్ ప్రేమ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ, వెంకటేశ్ గారితో కలిసి ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సినిమా ప్రమోషన్స్ కూడా ఎంజాయ్ చేస్తూ చేశాము. ఈ క్రెడిట్ అంతా అనిల్ రావిపూడిగారిదే" అని అన్నారు.
"ఈ సినిమాలో గోదావరి యాస మాట్లాడే 'భాగ్యం' కోసం అనిల్ రావిపూడి గారు నా పేరు చెప్పినప్పుడు, తనైతే చాలా ఈజీగా చేస్తుంది అంటూ వెంకటేశ్ గారు చాలా సపోర్ట్ చేశారట. ఇంత కామెడీ ఉన్న రోల్ చేయడం నా కెరియర్లో ఇదే ఫస్టు టైమ్. మహేశ్ బాబు గారు మమ్మల్ని ఇంటికి ఆహ్వానించి, 'ఏవయ్యా అనీలూ ఈ పిల్లని ఎక్కడ పట్టావ్' అని అన్నారు. జీవితంలో నేను ఇంతవరకూ రావడానికి కారణం మా అమ్మనే" అంటూ చెప్పింది.
" మా ఫాదర్ చనిపోయే సమయానికి మేము నలుగురం పిల్లలం. అమ్మ పెద్దగా చదువుకోలేదు .. తనకి ఎవరి సపోర్ట్ లేదు. పిల్లలను తానే చూసుకోవాలి అనే తపన ఉండేది. అందుకోసం మా అమ్మ ఇంటింటికి తిరిగి చీరలు అమ్మింది .. రియల్ ఎస్టేట్ ఏజెంటుగా చేసింది .. ఎల్ఐసి ఏజెంటుగాను చేసింది. అలా ఎన్నో కష్టాలు పడిన అమ్మను హ్యాపీగా చూసుకోవాలని అనుకునేదానిని. ఆ విషయంలో సక్సెస్ అయినందుకు గర్వంగా ఉంది" అని చెప్పింది.