KCR: కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం

BRS party meeting on Ferbruary 19

  • తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
  • త్వరలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుక
  • సిల్వర్ జూబ్లీ వేడుక, పార్టీ సభ్యత్వ నమోదు, ప్రభుత్వ వైఫల్యాలపై భేటీలో చర్చించే అవకాశం

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)  విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 19న పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

సమావేశ నిర్వహణకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, అనుబంధ విభాగాల ఏర్పాటు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అంతేకాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

KCR
Telangana
BRS
  • Loading...

More Telugu News