Revanth Reddy: గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy inaguarates Microsoft new campus

  • హైదరాబాద్‌తో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందన్న రేవంత్ రెడ్డి
  • భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అన్న ముఖ్యమంత్రి
  • మైక్రోసాఫ్ట్ విస్తరణ ద్వారా మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్న రేవంత్ రెడ్డి 

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి మైక్రోసాఫ్ట్ సంస్థకు మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందని అన్నారు.

భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)దేనని ఆయన పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ చేస్తున్న కృషిలో భాగంగా 500 పాఠశాలల్లో ఏఐని వినియోగిస్తూ బోధన జరుగుతోందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ ద్వారా తెలంగాణలోని యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

Revanth Reddy
Telangana
Microsoft
Hyderabad
  • Loading...

More Telugu News