Virat Kohli: ఆర్‌సీబీ కెప్టెన్‌గా ర‌జ‌త్ ప‌టీదార్‌.. కోహ్లీ ఏమ‌న్నాడంటే..!

Rajat Patidar New Captain of RCB Here What Virat Kohli Said Video goes Viral

  • ఆర్‌సీబీ కొత్త సార‌థిగా ర‌జ‌త్ ప‌టీదార్‌
  • ఈ మేర‌కు తాజాగా ఫ్రాంచైజీ ప్ర‌క‌ట‌న 
  • ర‌జ‌త్ కెప్టెన్‌గా ఎంపిక కావ‌డంపై కోహ్లీ స్పెష‌ల్ వీడియో
  • ఆర్‌సీబీ కెప్టెన్సీకి అత‌డు అన్ని విధాలా అర్హుడ‌న్న ర‌న్ మెషీన్‌

రాయ‌ల్ ఛాంలెజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ త‌మ జ‌ట్టుకు కొత్త కెప్టెన్ గా యువ ఆట‌గాడు ర‌జ‌త్ ప‌టీదార్ ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. గ‌త సీజ‌న్ వ‌ర‌కు సార‌థిగా ఉన్న ద‌క్షిణాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్ ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో యంగ్ ప్లేయ‌ర్ కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది. కాగా, ఆర్‌సీబీ ప‌గ్గాలు తిరిగి విరాట్ కోహ్లీ చేప‌డ‌తాడ‌ని ఇటీవ‌ల‌ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అత‌డు కెప్టెన్సీపై ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డంతో యాజ‌మాన్యం ర‌జ‌త్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.  

ఇక ఆర్‌సీబీకి కొత్త సార‌థిగా ర‌జ‌త్ ప‌టీదార్ ఎంపిక కావ‌డంపై ఆ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేశాడు. ర‌న్ మెషీన్ మాట్లాడుతూ... "రజత్ ప‌టీదార్‌ ముందుగా నేను నిన్ను అభినందిస్తున్నా. నీకు శుభాకాంక్షలు. ఈ ఫ్రాంచైజీలో నువ్వు ఎదిగిన విధానం, నీవు ప్ర‌ద‌ర్శించిన తీరుతో భారతదేశం అంతటా ఉన్న ఆర్‌సీబీ అభిమానులందరి హృదయాల్లో నువ్వు నిజంగా చోటు సంపాదించుకున్నావు. ఇక‌పై నీ ఆటను చూడటానికి వాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కెప్టెన్సీకి నువ్వు అన్ని విధాలా అర్హుడ‌వు. నాతో పాటు జట్టు సభ్యులంద‌రం నీవెంటే ఉంటాం. మా అందరి మద్దతు నీకు ఉంటుంది" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

More Telugu News