Kannappa: 'క‌న్న‌ప్ప‌'కు ప్ర‌భాస్‌, మోహ‌న్‌లాల్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..?

Manchu Vishnu Revealed Remuneration of Prabhas and Mohanlal for Kannappa

  • మంచు కుటుంబం నుంచి వస్తున్న భారీ బ‌డ్జెట్ ప్రాజెక్ట్‌ 'క‌న్న‌ప్ప‌'
  • ఈ మూవీలో ప్రభాస్, మోహ‌న్‌లాల్‌ తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ ఇండ‌స్ట్రీల‌కు చెందిన ప‌లువురు న‌టులు 
  • ఈ చిత్రానికి ప్ర‌భాస్‌, మోహ‌న్‌లాల్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా న‌టించార‌న్న విష్ణు
  • ఏప్రిల్ 25న వ‌ర‌ల్డ్‌వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా

మంచు కుటుంబం నుంచి వస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ముఖేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా, సుమారు రూ. 140కోట్ల భారీ బడ్జెట్‌తో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న వ‌ర‌ల్డ్‌వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేక‌ర్స్ ప్ర‌స్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల‌ను జోరుగా నిర్వ‌హిస్తున్నారు.

ఇక 'కన్నప్ప'లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహ‌న్‌లాల్‌ తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ ఇండ‌స్ట్రీల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు అతిథి పాత్రల‌లో నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్రభాస్, మోహ‌న్‌లాల్ స‌హా ఇత‌ర న‌టీన‌టుల‌ ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్, మోహ‌న్‌లాల్‌ తీసుకున్న పారితోషికంపై ఆసక్తికర విషయాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఓ ఇంటర్వ్యూలో హీరో మంచు విష్ణు మాట్లాడుతూ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. కాగా, ప్రభాస్ ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయ‌న‌ తెలిపారు. అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కూడా ఈ మూవీకి ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించారు. తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న అభిమానంతో వారు ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు విష్ణు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News