Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ భార్య వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

Police stopped Vallabhaneni Vamsi vehicle

  • వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించిన పోలీసులు
  • పోలీసు వాహనాన్ని ఫాలో అవుతూ వచ్చిన వంశీ భార్య 
  • నందిగామ వద్ద ఆమె వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. హైదరాబాద్ లో వంశీని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని వంశీ భార్య పంకజశ్రీ అనుసరిస్తూ వచ్చారు. నందిగామ వద్ద ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 

తాము నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళుతున్నామని, ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుందని, తమను అనుసరించవద్దని ఆమెకు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న ఓ డ్రైవింగ్ స్కూల్ లో ఆమెను ఉంచారు. ఆమె ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News