Anupam Kher: ప్రభాస్ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇన్‌స్టా పోస్టుతో కన్ఫర్మ్!

- ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో 'ఫౌజీ' మూవీ
- ఈ భారీ చిత్రంలో తాను నటిస్తున్నట్లు ప్రకటించిన అనుపమ్ ఖేర్
- భారతీయ సినిమా బాహుబలితో తన 544వ చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉందన్న నటుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఫౌజీ'. ఈ భారీ మూవీలో తాను నటిస్తున్నట్లు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా డార్లింగ్, దర్శకుడితో దిగిన ఫొటోలను ఆయన షేర్ చేశారు.
"భారతీయ సినిమా బాహుబలితో నా 544వ చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి చాలా ప్రతిభావంతుడైన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నా ప్రియమైన స్నేహితుడు సుదీప్ ఛటర్జీ ఈ మూవీకి డీఓపీగా ఉన్నాడు. ఈ సినిమా చాలా మంచి కథతో తెరకెక్కుతోంది" అని తన ఇన్‌స్టా స్టోరీలో అనుప్ ఖేర్ రాసుకొచ్చారు.