Thandel: శ్రీవారి సన్నిధిలో తండేల్ టీమ్.. వీడియో ఇదిగో!

--
తండేల్ సినిమా సూపర్ హిట్ కావడంతో చిత్ర బృందం గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంది. హీరోహీరోయిన్లు నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, దర్శకుడు చందూ మొండేటి తదితరులు శ్రీవారిని సేవించుకున్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సినిమా బృందానికి అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అల్లు అరవింద్, నాగ చైతన్య, సాయి పల్లవి, బన్నీ వాసు తదితరులు స్వామివారి దర్శనానికి వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.