Sake Sailajanath: పవన్‌పై శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు

Sailajanath Comments on Pawan Kalyan

  • రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకోవాలన్న శైలజానాధ్
  • యాత్రల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ
  • రాజకీయంగా చర్చనీయాంశమవుతున్న శైలజానాధ్ వ్యాఖ్యలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఇటీవల వైసీపీలో చేరిన సీనియర్ నేత సాకే శైలజానాధ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోని పలు క్షేత్రాల సందర్శన చేస్తున్నారు. తన కుమారుడు అకీరాతో కలిసి కేరళ, తమిళనాడులోని ప్రముఖ అలయాలను సందర్శిస్తున్నారు. 

దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్‌పై శైలజానాథ్ విమర్శలు చేశారు. యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలన్నారు. శైలజానాధ్ బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని ఆయన వ్యాఖ్యానించారు. 

ఇంతకు ముందు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై పవన్ కల్యాణ్ సీరియస్ కామెంట్స్ చేసిన తర్వాతనే పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఇప్పుడు శైలజానాథ్ శాంతి భద్రతలపై మాట్లాడుతూ పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకోవాలని వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది. ఇది ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.  

Sake Sailajanath
Pawan Kalyan
AP Politics
  • Loading...

More Telugu News